న్యూస్‌రీల్
వీరుల ఆయుధాలకు గ్రామోత్సవం వీరులకు నీరాజనాలు పలికిన ప్రజలు
నేటితో ముగియనున్న ఉత్సవాలు
ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2025
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 584.20 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 36,765 క్యూసెక్కు లు వచ్చి చేరుతోంది.
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 4,227 క్యూసెక్కులు విడుదల చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. బ్యారేజి వద్ద 12 అడుగుల నీటి మట్టం ఉంది.
కారెంపూడి: కారెంపూడిలో జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలలో భాగంగా శనివారం వీరుల గుడి ఆవరణలో కోడిపోరు నిర్వహించారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. ముందుగా వీర విద్యావంతు లు కోడిపోరు కథాగానం చేశారు. తర్వాత బండ్ల గణేష్ ఒక పుంజును మరొకరు మరో పుంజును బరి లోకి వదిలారు. రెండు పందేలలో బ్రహ్మనాయుడు పుంజు గెలిచిందని మూడో పందెంలో బ్రహ్మనాయు డు పుంజు ఓడిందని ప్రకటించారు. పీఠాధిపతి పిడు గు తరుణ్ చెన్నకేశవ బ్రహ్మనాయుడు పాత్రలో మరొ కరు నాయకురాలు నాగమ్మ పాత్రను పోషించారు.
రణక్షేత్రంలో గ్రామోత్సవాల సందడి
వీరుల ఆయుధాలతో వీరాచారులు పౌరుషంతో ఊగిపోయారు. అలనాటి వీరుల ఆయుధాలతో వీరంగమాడారు. కత్తులతో విన్యాసాలు చేశారు. వీరుల ఆయుధాలను వారిపై వాల్చి ఆవేశాన్ని తగ్గించారు. పాత కారెంపూడి బజార్లన్నింటిలో గ్రామోత్సవాలు కొనసాగాయి. గ్రామస్తులంతా ప్రతి ఇంటి వద్ద వారు పోసి కొబ్బరికాయలు కొట్టి పూల దండలు వేసి వీరులకు నీరాజనాలు పలికారు. వీరాచారులు ఆయుధా లను వారిపై వాల్చి ఆశీర్వాదం అందించారు. ఉద యాన్నే వీరుల గుడి నుంచి గ్రామోత్సవాలు ప్రారంభమయ్యాయి. చెన్నకేశవస్వామిని దర్శించుకుని అనంతరం ఆలయం బయట ఉన్న బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద కత్తి సేవలు చేసుకున్నారు. తర్వాత వీర్ల అంకాలమ్మ తల్లిని దర్శించుకుని అక్కడ కత్తి సేవలు కొనసాగించారు. తర్వాత నుంచి గ్రామోత్సవానికి వీరుల ఆయుధాలు బయలుదేరాయి. మొదట తోట బజారులో ఉన్న బ్రహ్మనాయుడు మేడ వద్దకు ఆయుధాలన్నీ తరలివెళ్లాయి. సంప్రదాయ కత్తి విన్యాసాలు చేశారు. ఆ ప్రాంత వాసులంతా పల్నాటి వీరులకు నీరాజనాలు పట్టారు. ఆ బజారులోనే వీరుల ఆయుధాలు ప్రతి గడప నుంచి పూజలందుకున్నాయి. గ్రామోత్సవం పూర్తయ్యే సరికి అర్థరాత్రి దాటే అవ కాశం కన్పిస్తోంది. కోట బురుజు సమీపంలో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి హారతులిచ్చారు. ఉదయాన్నే వీరాచారులు పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత నుంచి గ్రామోత్స వా లు నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పొంగళ్లు చేసుకుని అంకాలమ్మ తల్లి చెన్నకేశవస్వామి నైవే ద్యం అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వీరాచారు లతో పాటు ప్రజల వేలాదిగా ఉత్సవానికి తరలివచ్చారు.
ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ
ఉత్సవాలలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పాల్గొన్నారు. వారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డితో కలసి వీరుల గుడిలో ఆయుధాలకు పూజలు చేశా రు. అనంతరం ఎడ్ల పోటీలను ప్రారంభించారు.
బ్రహ్మనాయుడు మేడ వద్ద వీరుల ఆయుధాలకు పూజలు
కోడిపుంజును వదులుతున్న బండ్ల గణేష్, వీక్షిస్తున్న ఎమ్మెల్యే జూలకంటి
7
ఐదు రోజులుగా జరుగుతున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఆదివారంతో ముగియనున్నాయి. కళ్లిపాడు నాడు వీరుల ఆయుధాలు కళ్లి పోతురాజు మండపం వద్ద కళ్లికి ఒరగడంతో ఉత్సవాలను ముగించి వీరాచారులు స్వగ్రామాలకు పయనం కానున్నారు.
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు
పల్నాడు


