పత్తి రైతుల ‘యాప్’ సోపాలు!
చుక్కలు చూపిస్తున్న కిసాన్ కపాస్ యాప్ పనులు వదులుకొని స్లాట్ బుకింగ్‌కు ప్రయత్నిస్తున్న రైతులు స్లాట్ బుకింగ్‌లో సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు చోద్యం చూస్తున్న సీసీఐ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ
సాంకేతిక సమస్యలపై తక్షణమే చర్యలు
సత్తెనపల్లి: పత్తిని మద్దతు ధరకు విక్రయించుకునేందుకు అన్నదాతలకు తల ప్రాణం తోకకు వస్తోంది. పత్తి రైతుల సహనానికి కిసాన్ కపాస్ యాప్ పరీక్ష పెడుతుంది. పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవాలంటే తొలుత సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత కిసాన్ కపాస్ యాప్ స్లాట్ బుక్ చేసుకోవా ల్సి ఉంది. ఇక్కడే రైతులకు చుక్కలు కనిపిస్తున్నా యి. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇటు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), మార్కెటింగ్ శా ఖ అధికారులు, అటు వ్యవసాయ శాఖ అధికారులు చోద్యంచూస్తున్నారు. స్లాట్ బుకింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతిరోజూ ఉద యం 10 గంటలకు స్లాట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. స్లాట్ బుక్ కావాలంటే కనీసం ఒకటి, రెండు నిమిషాల సమయం పడుతుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసే సమయంలోనే బుకింగ్ పూర్తయినట్లు, ఎర్రర్ వంటివి కనిపిస్తున్నాయి. ఇదేమి మాయనో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. యా ప్ ద్వారా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే తట్టుకోలేక బయట అమ్ముకుంటారనే ఉద్దేశంతో ఇలా చేస్తు న్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సాంకేతికతతో ఇబ్బందులు...
జిల్లాలో 11 జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ గా ప్రస్తుతం సత్తెనపల్లి, నరసరావుపేట, క్రోసూ రు, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఏడు జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోలు చేపడుతున్నారు. రైతులు ఏ కొనుగోలు కేంద్రానికై నా స్లాట్ బుక్ చేసు కోవచ్చు. వారం రోజులుగా సర్వర్ సమస్య కారణంగా స్లాట్ బుకింగ్ అస్తవ్యస్తమైనప్పటికీ పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. రైతులు అన్ని పనులు వదిలిపెట్టి పత్తిని మద్దతు దరకు అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ కోసం నెట్ సెంట ర్లు, రైతు సేవా కేంద్రాల్లో కాచుకొని కూర్చుంటున్నా ఫలితం లేకుండా పోతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమందికి రెండు, మూడు జిన్నింగ్ మిల్లుల్లో స్లాట్ బుక్ అవుతుందంటే కిసాన్ కపాస్ యాప్ సరిగ్గా లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాంకేతిక సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని యాప్ లోనే ఉంది.
అక్కడక్కడా సాంకేతిక సమస్యలు వస్తే వెంట నే వాట్సాప్ గ్రూప్‌లో తెలియ చేయగానే యంత్రాంగం పరిష్కారం చేస్తున్నారు. ఎప్పటికప్పు డు కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ మానిటరింగ్ చేస్తున్నారు. ప్రతిరోజూ సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో 37 నుంచి 39 వరకు స్లాట్‌లు బుక్ అవుతున్నాయి. వీఏఓలు అందుబాటులో ఉండి కో–ఆర్డినేట్ చేస్తున్నారు.
– ఐ.వెంకటేశ్వరరెడ్డి,
ఉన్నత శ్రేణి కార్యదర్శి, సత్తెనపల్లి


