ఆంగ్లభాషపై పట్టు సాధించాలి
నరసరావుపేట రూరల్: విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని హైద్రాబాద్ విల్ టూ కెన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఆంగ్ల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఉచిత ఆన్‌లైన్ శిక్షణలో భాగంగా ఆదివారం ప్రేరణ తరగతులను ఎంఏఎం కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి 200మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. కార్యక్రమానికి ట్రైనర్‌గా హాజరైన రామేశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి తెలుగుతో పాటు ఇంగ్లిష్ మాట్లాడే విధంగా చేయడమే కార్యక్రమ ఉదేశమని తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ జిల్లాల్లో 53 వేల మంది ఉపాధ్యాయులకు ఈ తరగతులు పూర్తిచేసినట్టు తెలిపారు. ఏపీలోని విశాఖపట్నం, అన్నమయ్య జిలాల్లో పూర్తిచేసామని వివరించారు. ఏపీలో 16జిల్లాల్లో 25వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ప్రతి రోజూ దాదాపు 1500 మంది ఉపాధ్యాయులు ఆన్‌లైన్ క్లాస్‌లకు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమానికి అవకాశం కల్పించిన డీఈవో చంద్రకళకు ఽకృతజ్ణతలు తెలిపారు. కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు వేమూరి శ్రీనివాస్, సుందర్‌రావు, షేక్ కరీముల్లా, కొండం రాజులు పర్యవేక్షించారు.


