విజేతలకు పతకాలు ప్రదానోత్సవం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ ఏడాది జూన్ 21 నుంచి 30 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ షూటింగ్ ఛాంపియన్‌షిప్స్ 2025 ఏపీ విజేతలకు ఆదివారం స్థానిక వెల్‌కమ్ హోటల్లో పతకాల బహుకరణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సలాలిత్ తొట్టెంపూడి ఒక ప్రకటనలో తెలిపారు. ఏపి నుంచి మొత్తం 520 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో 204 పతకాలు సాధించారన్నారు. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ మల్లిఖార్జున నాయక్, కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, రోడిక్ కన్సల్టెంట్ ఎండీ రాజ్‌కుమార్‌లు క్రీడాకారులకు అందజేశారన్నారు.


