స్వర్ణం సాధించిన కేఎల్‌యూ విద్యార్థి ముఖేష్
తాడేపల్లి రూరల్:ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో కేఎల్‌యూ విద్యార్థి స్వర్ణపతకం సాధించినట్లు వర్సిటీ స్పోర్ట్స్ విభాగ డీన్ హరికిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నవంబర్ 24వ తేదీ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ షూటింగ్ పోటీలు జరుగుతున్నాయని, రాజస్థాన్ స్టేట్ షూటింగ్ రేంజ్‌లో ఆదివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కేఎల్‌యూకి ప్రాతినిధ్యం వహించిన నేలవల్లి ముఖేష్ స్వర్ణ పతకం సాధించాడని తెలిపారు. తమ యూనివర్సిటీ నుంచి తనిష్క్ మురళీధర్ నాయుడు, నాగసాయి తరుణ్ కూడిన బృందం రజత పతకాలు సాధించారని తెలిపారు. స్వర్ణ పతకం సాధించిన ముఖేష్‌ను రాష్ట్ర రైఫిల్ అసోసియేషన్ కార్యదర్శి డి. రాజకుమార్, వర్సిటీ పీడీలు గౌతమ్,శ్రీహరి పాల్గొన్నారు.


