దత్తత మరో మార్గం!
అనధికార దత్తత చట్టరీత్యా నేరం అర్హతగల వారికి అండగా శిశు గృహ జిల్లాలో జాతీయ దత్తత మాసోత్సవాలు
మాతృత్వం ఓ వరం..
సత్తెనపల్లి: వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా సంతాన సాఫల్యానికి నోచని దంపతులకు దత్తత ఓ వరం. దత్తత తీసుకోవడంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అనధికార దత్తత చట్ట రీత్యా నేరం. కొంతమంది ఈ విషయం తెలియక దళారుల చేతిలో మోసపోతున్నారు. అక్రమ మార్గాలను ఎంచుకొని చిక్కుల్లో పడుతున్నారు. జాతీయ దత్తత మాసోత్సవం సందర్భంగా నెలరోజుల పాటు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఒకటిన ప్రారంభమైన జాతీయ దత్తత మాసోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు, సదస్సులు ఈ నెల 30 వరకు నిర్వహించనున్నారు. ఈ నెల 24న సత్తెనపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శిశు గృహ కేంద్ర అధికారులు దత్తత ఏ విధంగా పొందాలి. దత్తత తీసుకునేందుకు ఉండాల్సిన అర్హతల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు.
అనధికార దత్తత చెల్లదు...
కొందరు బంధువులకు చెందిన పిల్లలను, తెలిసిన వారి పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకుంటున్నారు. తీసుకున్న వారికి జేజే యాక్ట్ సెక్షన్ 81 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
దరఖాస్తు చేసుకునే విధానం...
దత్తత కోరే తల్లిదండ్రులు తొలుత డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కారా.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్ సైట్‌లో దరఖాస్తు నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు ...
భార్యాభర్తల ఫ్యామిలీ ఫొటోగ్రాఫ్, పాన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువపత్రం, సంవత్సరం ఆదాయ ధ్రువీకరణ పత్రం, దీర్ఘకాలిక అంటూ వ్యాధి లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడలేదని, దత్తత తీసుకోవడానికి అర్హులని ధ్రువీకరిస్తూ మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి.


