అరకొర వేతనాలు.. చాకిరి మోపెడు
మెడికల్ సెలవులు ఇవ్వాలి
పోరాట దీక్షకు సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు 24న జిల్లా కలెక్టరేట్ వద్ద పోరాట దీక్షలు డిసెంబర్ 10 చలో ఎస్‌పీడీ కార్యాలయం వద్ద ధర్నాకు పిలుపు
పెదకూరపాడు: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అరకొర జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ భద్రత అయినా ఉందా అంటే అదీ లేదు. దీంతో వారు పోరాట దీక్షకు దిగ్గారు. పల్నాడు జిల్లాలో క్లస్టర్ రిసోర్స్ మొబైల్ టీచర్లు(సీఆర్‌ఎంటీ), మండల సమన్వయకర్తలు(ఎంఐఎస్), డేటా ఎంట్రీ ఆపరేటర్లు సుమారు 192 మంది పనిచేస్తున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారినా వారి ఎదుగుదలలో ఎలాంటి మార్పులు లేదు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకునేందుకు దశల వారీగా ఉద్యమం చేపట్టారు.
వీరి డిమాండ్లు.....
● సమగ్ర శిక్షలోని అన్ని కేటగిరీలకు హెచ్‌ఆర్ పాలసీ తక్షణం అమలు చేయాలి.
● అన్ని కేటగిరీలకు మినిమయం టైం స్కేల్ అమలు చేయాలి.
● ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ, హెల్త్ బెనిఫిట్స్, మెడికల్ సెలవులు, చైల్డ్ కేర్ సెలవులు అందించాలి.
● రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి
● గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను పూర్తిగా అమలు చేయాలి.
● సమగ్ర శిక్షలోని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు మెడికల్, చైల్డ్ సెలవులు అందించాలి. రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. పనిభారం తగ్గించాలి. న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకే ఈ పోరాటం. సమస్యలను వెంటనే పరిష్కరించాలి.
–జి.జ్యోతి, క్లస్టర్ మొబైల్ టీచర్
అరకొర వేతనాలు.. చాకిరి మోపెడు


