ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య వివాదం | Anakapalle Husband And Wife Incident | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య వివాదం

Nov 28 2025 1:36 PM | Updated on Nov 28 2025 2:28 PM

Anakapalle Husband And Wife Incident

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా: మండలంలోని కొంకసింగి గ్రామంలో అరటా లక్ష్మీపార్వతి(26) గురువారం తెల్లవారుజామున తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాంబిల్లి మండలం మామిడివాడ దరి కొత్తూరుకు చెందిన ఆమెతో కొంకసింగి గ్రామానికి చెందిన అరటా ప్రసాద్‌కు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. ప్రసాద్‌ నేవీలో ఉద్యోగం చేస్తూ గత నెల పదవీ విరమణ పొందాడు. వీరికి మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. 

ఈ నేపథ్యంలో మృతురాలి భర్త ప్రసాద్‌ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎక్కువగా క్రికెట్‌ బెట్టింగులు ఆడేవాడు. దీనివల్ల అధికంగా అప్పులు పాలయ్యాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవులయ్యేవి. ఈ కారణంగానే మనస్తాపం చెందిన లక్ష్మీపార్వతి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. నర్సీపట్నంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని, మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రామారావు తెలిపారు.    

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement