సాక్షి, తాడేపల్లి: మహాత్మా జ్యోతిరావ్ పూలేకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే గారు. తన సతీమణి సావిత్రి బాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్‌గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మరించుకుంటూ నివాళులు’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మహిళా విద్యను నేరంగా చూసిన రోజుల్లోనే మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన విప్లవకారుడు జ్యోతిరావుపూలే గారు. తన సతీమణి సావిత్రి బాయిని చదివించి ఈ దేశపు మొదటి మహిళా టీచర్‌గా నిలబెట్టిన దార్శనికుడు ఆయన. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయన సమాజానికి చేసిన సేవలను స్మ… pic.twitter.com/eNgDWAJ2n8
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 28, 2025
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావ్ పూలే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పూలే విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయని భాగ్యలక్ష్మి, మంగళగిరి ఇన్‌ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ నేతలు హాజరయ్యారు.


