
సాక్షి, విజయవాడ: మద్యం కుంభకోణం కేసు నిందితులను మూడో రోజు సిట్ తమ కస్టడీకి తీసుకుంది. ఈ క్రమంలో.. విజయవాడ జైలు నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేశ్ నాయుడ్ని తొలుత జీజీహెచ్‌కు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం తీసుకెళ్లారు. జైలు నుంచి తరలించే సమయంలో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
తప్పుడు కేసులు ఎక్కువ రోజులు నిలబడవు. తప్పకుండా న్యాయం, ధర్మం గెలుస్తుంది. తప్పుడు కేసులు పెట్టిన వారు ఏదో ఒకరోజు శిక్ష అనుభవిస్తారు అని చెవిరెడ్డి అన్నారు. ఆ సమయంలో మీడియా కాస్త దూరంలో ఉండగా.. చెవిరెడ్డిని మాట్లాడనీయకుండా పోలీసులు దురుసుగా నెడుతూ వాహనంలోకి తరలించారు.

ఇదీ చదవండి: వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది!