పవన్‌ కార్యాలయం ప్రకటనతో బట్టబయలైన లిక్కర్‌ దందా | Pawan's Office Statement Reveals Liquor Scam In AP | Sakshi
Sakshi News home page

పవన్‌ కార్యాలయం ప్రకటనతో బట్టబయలైన లిక్కర్‌ దందా

Feb 3 2026 2:03 PM | Updated on Feb 3 2026 2:11 PM

Pawan's Office Statement Reveals Liquor Scam In AP

కాకినాడ: ఏపీలో విచ్చలవిడిగా అధిక ధరలకు లిక్కర్‌ అమ్మకాలు జరుగుతున్నాయని చాలాకాలంగా వైఎస్సార్‌సీపీ చెబుతూ వస్తున్నమాట వాస్తవమేననేది తేటతెల్లమైంది. ఏపీలో అధిక మద్యం ధరలపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయం ప్రకటనతో లిక్కర్‌ దందా జరుగుతుందనేది బట్టబయలైంది. ఏపీలో మద్యం షాపుల్లో, బెల్టు షాపుల్లో అధిక ధరలపై తమకు వరుస ఫిర్యాదు వచ్చాయని పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయం ప్రకటించింది.  

ఇందులో పవన్‌ ప్రాతినిధ్య వహిస్తున్న కాకినాడ జిల్లాలో అధిక ధరలే కాకుండా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయానికి ఫిర్యాదులొచ్చాయి.  ఈ విషయాన్ని పవన్‌ కళ్యాణ్‌ కార్యాలయం ప్రకటించడంతో అసలు విషయం వెలుగుచూసింఇ. 

ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌శాఖక సూచించినట్లు పత్రికా ప్రకటనలో తెలిపింది పవన్‌ కార్యాలయం. ప్రధానంగా టీడీపీ, జనసేన నేతలు కలిసి ఏపీలో లిక్కర్‌ షాఫులు నిర్వహిస్తున్నారు. అత్యధిక శాతం లిక్కర్‌ దందా అంతా కూడా కూటమి కబంధ హస్తాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రమంతా అత్యధిక ధరలకు మద్యం అమ్ముతూ క్యాష్‌ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement