ఏసీబీ జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టిన సిట్‌ | YSRCP MP Mithun Reddy Arrest News July 20th Updates Details | Sakshi
Sakshi News home page

మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌.. బాబు ప్రతీకార డ్రామా.. హైలైట్స్‌

Jul 20 2025 8:25 AM | Updated on Jul 20 2025 1:19 PM

YSRCP MP Mithun Reddy Arrest News July 20th Updates Details

మిథున్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌.. లేటెస్ట్‌ అప్‌డేట్స్‌

కొనసాగుతున్న వాదనలు

  • లిక్కర్‌ కేసులో ఏసీబీ కోర్టులో కొనసాగుతున్న వాదనలు
  • మిథున్ రెడ్డి తరపున హాజరైన సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి
  • ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించనున్న ఇ.కోటేశ్వరరావు
  • కోర్టుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్,లేళ్ల అప్పిరెడ్డి,భరత్‌
  • కోర్టు బయట పోలీసుల ఓవరాక్షన్‌.. న్యాయాధికారికి ఫిర్యాదు చేసిన న్యాయవాదులు
  • బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాషా కారును అడ్డుకున్నారని ఫిర్యాదు

లిక్కర్‌ కేసులో ఏం తేల్చారు?: ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  • కూటమి ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది
  • ఈ క్రమంలోనే నా తనయుడు ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేసింది
  • ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వ విధానాల రూపకల్పనలో అవకాశమెక్కడిది?
  • జగన్‌కు సన్నిహితంగా ఉంటున్నాడనే మిథున్‌రెడ్డిపై కేసు
  • కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిథున్‌రెడ్డిని వేధిస్తున్నారు
  • గతంలోనూ మిథున్‌రెడ్డిని ఎంతో ఇబ్బంది పెట్టారు
  • మిథున్‌రెడ్డిపై పెట్టింది తప్పుడు కేసే
  • లిక్కర్‌ కేసులో ఇప్పటిదాకా ఏం తేల్చారు
  • మా మీద ఉన్న కక్ష.. విద్వేషంతో.. జిల్లాలో మా కుటుంబానికి ఉన్న పట్టును చూసే చంద్రబాబు ప్రతీకార రాజకీయం ప్రదర్శిస్తున్నారు
  • తప్పు చేయలేదు కాబట్టి మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు
  • రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ప్రజాతిరస్కారం తప్పదు

విజయవాడ కోర్టుకి మిథున్‌రెడ్డి తరలింపు

  • విజయవాడ కోర్టుకి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపు
  • ఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చిన సిట్‌ అధికారులు
  • కోర్టు వద్ద పోలీసుల ఓవరాక్షన్
  • న్యాయవాదులను సైతం లోపలికి అనుమతించని పోలీసులు
  • కోర్టుకి అన్ని వైపులా బారికేడ్లతో దారులను మూసేసిన పోలీసులు
  • కోర్టు ప్రధాన ద్వారం కూడా మూసివేసిన పోలీసులు
  • పోలీసులకు న్యాయవాదులకు మధ్య వాగ్వాదం

 

కాసేపట్లో ఏసీబీ జడ్జి ముందుకు..

  • విజయవాడ జీజీహెచ్‌లో ఎంపీ మిథున్‌రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలు
  • లిక్కర్‌ స్కాం కేసులో ఏ-4గా ఉన్న మిథున్‌రెడ్డి
  • కాసేపట్లో ఏసీబీ జడ్జి ముందు హాజరుపర్చనున్న సిట్‌


అక్రమ కేసులకు జడిసేది లేదు

  • రాష్ట్రంలో  చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు
  • ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అక్రమం
  • లిక్కర్ పాలసీలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదు
  • లిక్కర్ పాలసీ ప్రభుత్వం నడిపింది.. అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదు
  • వైఎస్సార్‌సీపీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టిన భయపడేది లేదు
    :::ఎమ్మెల్యే విరుపాక్షి

విజయవాడ: కోర్టు దగ్గర పోలీస్ ఆంక్షలు
కోర్టుకు వచ్చే అన్ని దారులు బారికేడ్లు పెట్టి మూసేసిన పోలీసులు
అడ్వకేట్‌లను కూడా కోర్టులోకి అనుమతించని పోలీసులు
పోలీసులతో వాగ్వాదానికి దిగిన అడ్వకేట్‌లు.. అనంతరం వారిని లోపలకు అనుమతించిన పోలీసులు
గేట్లు సైతం మూసేసిన పోలీసులు

ప్రభుత్వాసుపత్రికి మిథున్‌రెడ్డి తరలింపు

  • విజయవాడ ప్రభుత్వాసుపత్రికి ఎంపీ మిథున్‌రెడ్డి తరలింపు
  • కాసేపట్లో మిథున్‌రెడ్డికి వైద్య పరీక్షలు
  • ఆస్పత్రి వద్ద భారీ బందోబస్తు.. వైఎస్సార్‌సీపీ శ్రేణుల అడ్డగింత
  • వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశం
  • లిక్కర్‌ స్కాం కేసులో శనివారం రాత్రి మిథున్‌రెడ్డిని అరెస్ట్‌ చేసిన సిట్‌

విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసుల ఓవరాక్షన్‌

  • కాసేపట్లో వైద్య పరీక్షలు నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి మిథున్ రెడ్డి
  • ప్రభుత్వ హాస్పటల్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు
  • ప్రభుత్వ హాస్పటల్ కు భారీగా చేరుకుంటున్న  వైఎస్సార్‌సీపీ శ్రేణులు
  • వైఎస్సార్‌సీపీ నేతల వాహనాలకు మాత్రమే అనుమతి నిరాకరణ

ఏపీలో కొనసాగుతున్న రాజకీయ కక్షసాధింపులు

  • లేని లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్‌సీపీ కీలక నాయకుల అరెస్టులు
  • ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా 11 మంది అరెస్టు
  • తాజాగా ఎంపీ మిథున్ రెడ్డిని కూడా అరెస్టు చేసిన సిట్
  • ఇప్పటి వరకు 12 మందిని అరెస్టు చేసి  48 మంది పేర్లను ఛార్జిషీటులో పేర్కొన్న సిట్
  • మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కీలక నేతల అరెస్టే లక్ష్యంగా పని చేస్తున్న సిట్ అధికారులు
  • నిజానికి చంద్రబాబు హయాంలో కంటే జగన్ హయాంలోనే ప్రభుత్వానికి ఎక్కువగా వచ్చిన ఎక్సైజ్ ఆదాయం
  • అయినప్పటికీ రూ.3 వేల కోట్లు పక్కదారి పట్టాయంటూ తప్పుడు కేసు నమోదు
  • రూ.50 వేల కోట్లు కొట్టేశారంటూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబు
  • రూ.35 వేల కోట్లు అంటూ బొంకిన పవన్ కళ్యాణ్
  • నోటికొచ్చినట్లు మాట్లాడుతూ లేని స్కాంని ఉన్నట్టు భేతాళ కథలు అల్లుతున్న ప్రభుత్వ పెద్దలు
  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టునే ఛార్జిషీటు, రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొంటున్న సిట్
  • ఎల్లోమీడియా తప్పుడు రాతలు, సిట్ తప్పుడు విచారణలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్
  • కోర్టుల్లోనే న్యాయపోరాటం చేస్తామంటున్న వైఎస్సార్‌సీపీ
  • ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డికి సంఘీభావం తెలిపిన పార్టీ నేతలు
  • మిథున్ రెడ్డికి అండగా వైఎస్సార్‌సీపీ

జీజీహెచ్‌కు తరలించే ముందు సిట్‌ కార్యాలయం వద్ద మిథున్‌రెడ్డి

వాట్‌ నెక్స్ట్‌

  • మద్యం పాలసీ అక్రమ కేసులో వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌
  • విచారణ పేరిట విజయవాడకు పిలిచి మరీ అరెస్ట్‌ చేసిన సిట్‌
  • సుదీర్ఘ విచారణ తర్వాత.. అరెస్ట్‌ చేసినట్లు శనివారం రాత్రి మిథున్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం
  • ఇవాళ ఏసీబీ కోర్టు/జడ్జి ఎదుట మిథున్‌రెడ్డిని ప్రవేశపెట్టే అవకాశం
  • మిథున్‌రెడ్డిని కస్టడీకి కోరనున్న సిట్‌!
  • రిమాండ్‌ విధించే అవకాశం?
  • అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

 మద్యం అక్రమ కేసులో చంద్రబాబు సర్కార్‌ బరి తెగింపు

  • ఆధారాల్లేని లిక్కర్‌ స్కాంలో..  వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌
  • విచారణ పేరిట పిలిచి మరీ అరెస్ట్‌ చేసిన సిట్‌
  • రాజకీయ కక్షతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధిస్తోన్న చంద్రబాబు
  • నేడు జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశం
  • మిథున్‌రెడ్డిని రిమాండ్‌ కోరనున్న సిట్‌
  • మద్యం మాఫియా మూలవిరాట్టు చంద్రబాబే

 👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


మద్యం స్కామ్‌.. ఓ కట్టుకథ

  • రెడ్ బుక్ రాజ్యాంగానికి రెడ్ కార్పెట్ వేసే పాలన సాగిస్తున్నారు.
  • ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను
  • మద్యం స్కామ్ అనేది ఒక కట్టు కథ
  • వైయస్సార్సీపి నేతలను అరెస్టు చేయడం కోసమే మద్యం స్కామ్ ను తెరపైకి తెచ్చారు.
  • వైయస్ జగన్ సన్నిహితులపై అక్రమ కేసులు పెడుతున్నారు
  • వైయస్‌ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి శునక ఆనందం పొందుతున్నారు..
  • కూటమి నేతల తప్పుడు కేసులకు ఎవరూ భయపడరు.
    :::అరకు ఎంపీ తనుజారాణి

అబద్ధాలపుట్టగా ఛార్జ్‌షీట్‌

  • లేని మద్యం కేసును సృష్టించి చంద్రబాబు కుట్రలు
  • అవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రం
  • లేని కుంభకోణం ఉన్నట్లుగా చూపే పన్నాగం
  • అబద్ధాల పుట్టగా చార్జ్‌షీట్‌ దాఖలు
  • పెరిగిన నిందితులు
  • మొత్తం 48కి పెరిగిన నిందితుల సంఖ్య

 👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

 

మాఫియా డాన్ చంద్రబాబే‌

  • 2014-19 మధ్య యథేచ్ఛగా చంద్రబాబు దోపిడీ
  • ఖజానాకు గండికొట్టి అస్మదీయులకు దోచిపెట్టిన బాబు
  • రూ.25 వేల కోట్లకు మించి అక్రమాలు
  • సీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబు
  • అప్పటి దందానే నేడూ కొనసాగిస్తున్న వైనం!
  • తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే అక్రమ కేసులు..అరెస్టులు

👉పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


మిథున్‌రెడ్డి అరెస్ట్‌ అక్రమం: వైఎస్సార్‌సీపీ

ఇది స్కామ్‌ కాదు.. చంద్రబాబు ప్రతీకార డ్రామా: వైఎస్సార్‌సీపీ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement