జోగులాంబ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి | Panchayat Secretary Caught Taking Bribe In Jogulamba Gadwal District To Clear Indiramma House File | Sakshi
Sakshi News home page

జోగులాంబ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

Mar 13 2026 7:31 PM | Updated on Mar 13 2026 8:05 PM

Panchayat Secretary Caught Taking Bribe In Jogulamba Gadwal District

సాక్షి, జోగులాంబ గద్వాల: లంచం తీసుకుంటూ  పంచాయతీ కార్యదర్శి ఏసీబీ వలకు చిక్కాడు. అయిజా మండలం ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి బోయ రంగన్న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ వ్యక్తికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా.. క్లియరెన్స్ ఇవ్వడానికి కార్యదర్శి ఏకంగా రూ. 20 వేలు డిమాండ్ చేశారు.

మొత్తం రూ. 20 వేలకు గాను రూ.15 వేలు ఒప్పందం కుదుర్చుకున్న కార్యదర్శి.. శుక్రవారం ఎంపీడీవో  కార్యాలయం ఆవరణలో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యండెడ్‌గా దొరికిపోయాడు. కార్యదర్శి రంగన్నను అరెస్టు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement