సాక్షి, వరంగల్: హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి నివాసంం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. అక్రమంగా వందల కోట్లు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్‌లో 10 చోట్ల ఏసీబీ తనిఖీలు చేస్తోంది. గతంలో ఓ ప్రైవేట్ పాఠశాల అనుమతి కోసం లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన అనంతరం.. ఆయన ఆస్తులపై నిఘా పెట్టిన ఏసీబీ.. భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించింది.


