‘రేవంత్‌ నీ ఉడత ఊపులకు భయపడను’ | Ktr Slams Revanth Reddy Over Acb Investigation On Formula E Car Race Case | Sakshi
Sakshi News home page

‘రేవంత్‌ నీ ఉడత ఊపులకు భయపడను’

Jun 16 2025 6:38 PM | Updated on Jun 16 2025 8:18 PM

Ktr Slams Revanth Reddy Over Acb Investigation On Formula E Car Race Case

సాక్షి,హైదరాబాద్‌: ఈ-కారు కేసు.. లొట్టపీసు కేసు. సీఎం రేవంత్‌ నీ ఉడత ఊపులకు భయపడను. దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టు. రేవంత్‌ జైలుకు వెళ్లాడు కాబట్టి మమ్మల్ని జైలుకి పెట్టాలనుకుంటున్నారు’ అంటూ కేటీఆర్‌ మండిపడ్డారు.  

ఫార్ములా ఈకార్‌ రేసు కేసులో ఇవాళ కేసీఆర్‌ ఏసీబీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం,తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే. ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రే. నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీలో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిపొద్ది అని చెప్పాను. నువ్వు ముందుకు రా? నేను తప్పు చేయలేదు అని లై డిటెక్టర్ సిద్దం కావాలని డిమాండ్ చేశాను.కానీ రాలేదు.

ఉదయం 10 గంటల నుంచి అడిగిందే అడుగుడు. అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదు. సీఎం రేవంత్‌ పంపిన పశ్నలే వీళ్లు అడుగుతున్నారు. వీళ్లకు పరిపాలన చేతకాదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ సాధించిన నేత కేసీఆర్, హరీష్ రావును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి నెల రోజులు జైల్లో ఉన్నాడు.  కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. చేయని తప్పుకు కేసిఆర్, హరీష్ రావును కాళేశ్వరం కేసులో జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. నన్ను కూడా ఈ తుపెల్ కేసుతో జైల్లో పెట్టాలని చూస్తున్నారు. మా ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కూడా తుపెల్  కేసు అన్నారు. నాపై 14 కేసులు పెట్టారు. 14000 కేసులు పెట్టుకో. ఎవ్వడు భయపడడు.

అందరూ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు సంబరాలు చేసుకుందాం. కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలి’ అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.  

Advertisement
 
Advertisement
Advertisement