
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ఏసీబీకి భారీ అవినీతి తిమింగలం కాదు.. ఏకంగా డైనోసార్ చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
గత కొంతకాలంగా ఏడీఈ అంబేద్కర్‌కు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లలో నగదును స్వాధీనం చేసుకున్నారు. మణికొండలోని ఏడీఈ ఇల్లు,బంధువులు,కుటుంబసభ్యుల ఇళ్లతో పాటు గచ్చిబౌలి,మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ సోదాలు జరిపింది. విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేద్కర్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఇతర జిల్లాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు అంబేద్కర్ రూ.300కోట్లకుపైగా ఆస్తిపాస్తులున్నట్లు గుర్తించారు.పదెకరాల స్థలంలో పెద్ద కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఏసీబీ అధికారుల సోదాల్లో తేలింది.