
విజయవాడ: సిట్ జప్తు చేసిన రూ. 11 కోట్లు అంశానికి సంబంధించి నేడు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాచవరం ఎస్‌బీఐలో ఆ నగదును ఎప్పుడు డిపాజిట్ చేశారో తేదీ, సమయం తెలిపాలని కోర్టు ఆదేశించింది. నగదు జమ రశీదులకు సంబంధించి వీడియో, ఫోటో క్లిప్పింగ్స్ అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. తదుపరి చర్యల కోసం బ్యాంకుకు ఈ నగదు పంపించేముందు తీసిన ఫోటోలు లేదా పంచనామాలు కోర్టుకు ఇవ్వాలని పేర్కొంది.
కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ ఫాంహౌస్‌లో సిట్ జప్తు చేసిన రూ.11 కోట్లు రాజ్ కేసిరెడ్డికి చెందినవేనంటూ నమ్మించడానికి చేసిన యత్నం ఏసీబీ కోర్టు సాక్షిగా శనివారం బెడిసి కొట్టడంతో అప్పటికప్పుడు మరో నాటకానికి తెర లేపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో పంచనామా నిర్వహించాలని, ప్రతీ నోటుపై ఉన్న సీరియల్ నంబర్‌ను రికార్డ్ చేయాలని సిట్ దర్యాప్తు అధికారిని ఏసీబీ కోర్టు ఆదేశించింది. డిపాజిట్ చేశామని చెబుతున్నందున అందుకు సంబంధించిన రిసీప్ట్ (కౌంటర్ ఫైల్) చూపాలని కోరగా, తమ బండారం బయట పడుతుందని దర్యాప్తు అధికారి పత్తా లేకుండా పోయిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: