
సాక్షి,విజయవాడ: లిక్కర్ అక్రమ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ అక్రమ కేసులో ఏ30 పైలా దిలీప్‌కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 117రోజులుగా జైల్లో ఉన్న దిలీప్‌కు గురువారం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. రాజ్ కసిరెడ్డి పీఎగా ఉన్న పైలా దిలీప్‌ను మే1న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నాటి నుంచి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.