చంద్రబాబు, రేవంత్‌కు హాట్‌లైన్ సంబంధాలు: మార్గాని భరత్‌ | Margani Bharat Questions TDP Silence | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, రేవంత్‌కు హాట్‌లైన్ సంబంధాలు: మార్గాని భరత్‌

Mar 15 2026 3:35 PM | Updated on Mar 15 2026 4:19 PM

Margani Bharat Questions TDP Silence

తూర్పుగోదావరి జిల్లా: రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన ఎంపీ మహేష్ యాదవ్‌పై టీడీపీ ఓ నిర్ణయం తీసుకుంటుందో.. లేదో స్పష్టం చేయాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్‌ చేశారు. ఇంతవరకు టీడీపీ నాయకులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ మార్గాని భరత్ మాట్లాడుతూ.. ‘ఏపీ సీఎం చంద్రబాబుకు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హాట్‌లైన్ సంబంధాలు ఉన్నాయి.  రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబుతో చెప్పి నిలుపు చేయించానని రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతిన్నప్పటికీ చంద్రబాబు పట్టించుకోలేదు.

పైకి నో టు డ్రగ్స్ అంటూ క్యాంపెయిన్ చేస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ అందుబాటులో ఉంటున్నాయి. రేవ్ పార్టీలో అడ్డంగా దొరికిన మహేష్ యాదవ్‌తో పదవికి రాజీనామా చేయించాలి, ఆయనను చంద్రబాబు పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలి.  గత ప్రభుత్వ హయాంలో డ్రగ్స్ అదుపు చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు’ అని తెలిపారు. 

ఇదీ చదవండి:  పుట్టా మహేష్‌ను రక్షించడానికి రంగంలోకి చంద్రబాబు 

Advertisement
 
Advertisement
Advertisement