‘చంద్రబాబు.. ఇదేనా మీరు చెప్పుకునే క్రమశిక్షణ?’ | YSRCP Leaders Slam TDP MP Putta Mahesh | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు.. ఇదేనా మీరు చెప్పుకునే క్రమశిక్షణ?’

Mar 15 2026 3:53 PM | Updated on Mar 15 2026 5:07 PM

YSRCP Leaders Slam TDP MP Putta Mahesh

తిరుపతి: డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని తిరుపతి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ భూమన అభినయ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.  డ్రగ్స్‌ కేసులో పుట్టా మహేష్‌ యాదవ్‌ హైదరాబాద్‌ పోలీసులకు పట్టుబడటం సంచలనం రేకెత్తిస్తోందన్నారు అభినయ్‌రెడ్డి. టీడీపీ అంటే  క్రమ శిక్షణకు మారుపేరు అని చెప్పుకునే చంద్రబాబు మాటలకు అర్థం ఇదేనా?  అని నిలదీశారు. ఈ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోక,  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించారని విమర్శించారు. 

‘పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనకుండా, ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఏవిధంగా పక్కదారి పడుతున్నారో చూడండి.  ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ,పిస్టల్ తో కాల్పులు జరిపినట్లు సమాచారం కూడా ఉంది. పుట్టా మహేష్ యాదవ్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలి. డ్రగ్స్ నిర్మూలిస్తాం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు?, ఏపీలో రెండున్నరేళ్ల లో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, జరుగుతున్నాయి

టిటిడి చైర్మన్‌గా త్యంత చెత్త చైర్మన్ గా బీఆర్‌ నాయుడు ఉన్నారు. తిరుమల క్యూ లైన్ లో భక్తులు నిరసన చేపట్టారు , గతంలో ఎన్నడు క్యూ లైన్ లో నిరసన తెలిపింది లేదు’ అని స్పష్టం చేశారు. 

ఎంపీ డ్రగ్స్‌ తో పట్టుబడటం హేయమైన చర్య
విజయవాడ: ఓ ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి డ్రగ్స్‌తో పట్టుబడటం హేయమైన చర్య అని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఎంపీ స్థానంలో ఉండి  ఈ తరహా పనులు చేయడమేంటి?,  భారతదేశ చరిత్రలో ఒక ఎంపీ డ్రగ్స్ తో పట్టుబడానికి పుట్టా మహేష్ ఒక నిదర్శనం.  కూటమి వచ్చిన నాటి నుంచి ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా బయటికి వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో అమ్మాయిల పై అరాచకాలు, దుర్మార్గాలు , రెడ్ బుక్ సిద్ధాంతాలు, కేసులు ఇవే కనిపిస్తున్నాయి. 

ఇప్పుడు ఏకంగా ఎంపీ డ్రగ్స్ తో దొరకడమంటే మాటలు కాదు. తమ ఎంపీ డ్రగ్స్ తో దొరికడం పై  కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఎంపీ మహేష్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఏపీలో  ప్రభుత్వం డ్రగ్స్, గంజాయిని అరికట్టాలంటున్నారు. ఏపీలో ప్రస్తుతం స్కూల్స్ లో కూడా గంజాయి దొరుకుతుంది.  టీడీపీ ఎంపీలు డ్రగ్స్ కల్చర్ కు స్వాగతం పలుకుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమనాలి.  టీడీపీ మంత్రులు,ఎమ్మెల్యేలకు హైదరాబాద్ ఆటవిడుపుగా మారింది. శుక్రవారం సాయంత్రం అవ్వగానే హైదరాబాద్‌కు వెళ్లిపోతున్నారు. టిడిపి నేతలు ఏం చేస్తున్నారో అంతా చూస్తున్నారు’ అని విమర్శించారు. 

Advertisement
 
Advertisement
Advertisement