Formula-E Race Case: ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు ఏసీబీ నోటీసులు | ACB Issues Notice To IAS Arvind Kumar Over Formula-E Race Case | Sakshi
Sakshi News home page

Formula-E Race Case : ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు ఏసీబీ నోటీసులు

Jun 25 2025 4:11 PM | Updated on Jun 25 2025 4:25 PM

ACB Issues Notice To IAS Arvind Kumar Over Formula-E Race Case

సాక్షి,హైదరాబాద్‌: ఫార్ములా ఈ రేసు కేసులో కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఏసీబీ అధికారులు  ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. 

ప్రస్తుతం కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. అయితే, ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు రెండోసారి విచారించారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్‌ అరవింద్‌ కుమార్‌కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.  

ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అరవింద్ కుమార్.. ఈనెల 30వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement