లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయి.. | Community Organizer caught in ACB trap | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయి..

Mar 10 2026 7:50 PM | Updated on Mar 10 2026 8:02 PM

 Community Organizer caught in ACB trap

హైదరాబాద్‌: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ వలలో మరో చేప చిక్కింది. మూసాపేట సర్కిల్-53, కూకట్‌పల్లి జోన్‌లో కమ్యూనిటీ ఆర్గనైజర్‌గా పని చేస్తున్న ఏవో కె.మురళిని ఆర్ఆర్‌ఆర్‌ రేంజ్ యూనిట్ అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. 

మహిళా పొదుపు సంఘానికి చెందిన మహిళల బృందానికి 20 లక్షల రూపాయల రుణం మంజూరు ప్రక్రియను పూర్తిచేసినందుకు 18,000 రూపాయల లంచాన్ని డిమాండ్‌ చేశాడు కె.మురళి. ఫిర్యాదుదారుల నుంచి ఆ డబ‍్బును తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మురళిని అరెస్ట్ చేసిన అధికారులు, కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.

ఏ ప్రభుత్వ ఉద్యోగైనా లంచం డిమాండ్‌ చేస్తే ప్రజలు 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ సూచించింది. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. అవినీతి నిరోధక శాఖ తెలంగాణ వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (తెలంగాణ ఏసీబీ), ఎక్స్ (@తెలంగాణ ఏసీబీ) ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చు. ఫిర్యాదుదారు పేరు, వివరాలను గోప్యంగా ఉంచుతారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement