ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి | Four Injured After Drunk Driver In Speeding Car Hits Parked Bikes In Hyderabad, Details Inside | Sakshi
Sakshi News home page

ఢీ కొట్టి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి

Mar 10 2026 8:09 AM | Updated on Mar 10 2026 9:52 AM

Drunk Driver In Speeding Car Hits Parked Bikes

హైదరాబాద్‌: మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం... షాద్‌నగర్‌కు చెందిన సర్ఫరాజ్, హుస్సేన్, షమీర్, మాజీద్‌లు రెండు బైక్‌లపై పల్లెచెరువు మీదుగా చార్మినార్‌కు షాపింగ్‌ నిమిత్తం వెళ్తున్నారు.

 అదే సమయంలో నగరానికి చెందిన కిషోన్, టోటన్‌లు పల్లెచెరువు మీదుగా కారులో ఇంటికి వెళ్తున్నారు. అతివేగంగా వచ్చిన ఆ కారు వారి బైక్‌లను బలంగా ఢీ కొట్టింది. నలుగురు యువకులు పక్కకు పడిపోయి, స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే కారు డ్రైవర్‌ కిషోర్‌ భయంతో కారును మరింత వేగంగా పోనివ్వడంతో దాని కింద భాగంలో బైక్‌ చిక్కుకుపోయింది. 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కేసు దర్యాప్తులో ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement