
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: లంచం తీసుకుంటూ డోర్నకల్ సీఐ రాజేష్ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. బెల్లం వ్యాపారి నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా శనివారం రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు.

ఓ అక్రమ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు బేతోలు ప్రాంతానికి చెందిన వ్యాపారి వద్ద సీఐ రాజేష్ రూ.50 వేలు డిమాండ్ చేయగా.. వ్యాపారి రూ.30 వేలు ఇచ్చేందుకు అంగీకరించాడు. వ్యాపారి ఏసీబీని ఆశ్రయించగా.. సీఐ ఇంట్లో వ్యాపారి నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.