సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. తాజాగా కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. కవిత రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా.. గతేడాది సెప్టెంబర్ 3న తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2021లో నిజామాబాద్ స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా విజయం సాధించారు. కాగా.. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. అంతేకాకుండా సోమవారం తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి శాసనమండలి ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. దీంతో మండలి ఛైర్మన్ తాజాగా కవితి రాజీనామాను ఆమోదించారు.


