సాక్షి హైదరాబాద్: ఇటీవల జరిగిన ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై ఏబీఎన్ ఛానెల్ ప్రతినిధి వైఖరిని బీఆర్ఎస్ ఖండించింది. ప్రత్యేక చర్చ సందర్భంగా MLC రవీందర్ రావుపై ఏబీఎన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపింది. పాత్రికేయ విలువలకు ప్రజాస్వామ్యా స్పూర్తికి ఇది విరుద్ధం అని పేర్కొంది. కనుక తక్షణమే ఎమ్‌ఎల్‌సీకి, ఏబీఎన్ ప్రతినిధులు క్షమాపణ చెప్పాలని పేర్కొంది. ఇక నుంచి ఏబీఎన్ ప్రతినిధులను బీఆర్ఎస్ సమావేశాలకు అనుమతించేది లేదని కీలక నిర్ణయం తీసుకుంది.


