
ఖమ్మం జిల్లా: ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్ద వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కోసం లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ.. సబ్ రిజిస్ట్రార్ అరుణ ఏసీబీకి చిక్కారు. ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
ఓ వ్యక్తి తన కుమారుడు పేరు మీద సొంత భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు చలానా తీశాడు. అయితే గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు చేసినందుకు సబ్ రిజిస్టార్ రూ.50 వేలు డిమాండ్ చేయగా.. రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
సబ్ రిజిస్ట్రార్ ఆదేశించడంతో డాక్యుమెంటరీ రైటర్ పుచ్చకాయల వెంకటేశ్ కార్యాలయంలో బాధితుడు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.