చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నా.. చెవిరెడ్డి కంటతడి | Vijayawada: Chevireddy Bhaskar Reddy Emotional In Court | Sakshi
Sakshi News home page

చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నా.. చెవిరెడ్డి కంటతడి

Jul 22 2025 5:12 PM | Updated on Jul 22 2025 8:01 PM

Vijayawada: Chevireddy Bhaskar Reddy Emotional In Court

సాక్షి, విజయవాడ: కోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. జడ్జి ముందు తన వాదనలు వినిపించుకునే క్రమంలో చెవిరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి, తన సోదరుడు మద్యం కారణంగానే చనిపోయారని చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లే తాను మద్యం జోలికి వెళ్ల లేదు, వెళ్లబోనని భాస్కర్‌రెడ్డి చెప్పారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నానని బాధగా ఉందని చెవిరెడ్డి అన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై రెడ్‌బుక్‌ కుట్రతో నమోదు చేసిన అక్రమ కేసును వేధింపులకు పాల్పడటమే లక్ష్యంగా కూటమి సర్కార్‌ పాలన సాగుతోంది. అందుకోసం అబద్ధపు వాంగ్మూలా­లు, తప్పుడు సాక్ష్యాలతో భేతాళ కుట్రకు తెరతీసింది. ఆ కుట్రలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ38గా చేర్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement