
హైదరాబాద్: జీఎస్టీ రిజి్రస్టేషన్ కోసం రూ.8 వేల లంచం తీసుకుంటూ మాదాపూర్ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్, ఎం.సుధ నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. హైదరాబాద్ ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నాంపల్లిలోని గగన్ విహార్‌లోని కార్యాలయంలో ఓ కంపెనీకి సంబంధించిన జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్యాక్స్ ఆఫీసర్ సుధ రూ.8 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు మంగళవారం ఆమె బాధితుడిని నుంచి నగదు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.