ఎంపీ మిథున్‌రెడ్డికి వసతులపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు | Acb Court Issues Key Orders On Jail Facilities For Mp Mithun Reddy | Sakshi
Sakshi News home page

ఎంపీ మిథున్‌రెడ్డికి వసతులపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు

Jul 22 2025 9:29 PM | Updated on Jul 22 2025 9:42 PM

Acb Court Issues Key Orders On Jail Facilities For Mp Mithun Reddy

సాక్షి, విజయవాడ: రాజమండ్రి సెంట్రల్‌ జైలు అధికారులకు ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ మిథున్‌రెడ్డికి జైల్లో వసతులపై ఆదేశాలిచ్చిన ఏసీబీ కోర్టు.. వారంలో మూడు సార్లు లాయర్ల ములాఖత్‌కు అనుమతి ఇచ్చింది.

వారానికి మూడు సార్లు కుటుంబసభ్యుల ములాఖత్‌కు కూడా కోర్టు అనుమతులు ఇచ్చింది. బెడ్ సదుపాయం కల్పించాలని కోర్టు ఆదేశించింది. రోజుకొకసారి ఇంటి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చిన కోర్టు.. న్యూస్ పేపర్, మినరల్ వాటర్ అనుమతించాలని ఆదేశించింది.

మద్యం కుంభకోణం కేసులో ఎంపీ మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. రాజమండ్రి జైల్లో తనకు కేటాయించిన బ్లాక్‌లో సరైన సదుపాయలు లేవని చెబుతూ ఆయన పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎంపీ మిథున్‌రెడ్డి సదుపాయాల పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఒక ఎంపీకి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇస్తున్నారా? అని రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారిని ఏసీబీ జడ్జి ప్రశ్నించారు.

అయితే.. కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేస్తామని జైలు అధికారులు చెప్పారు. దీంతో.. చట్టాలు చేసే వారికి ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వాలి కదా అని జడ్జి అన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఈ పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement