
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-కారు రేసు కేసు కీలక మలుపు తిరిగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. రేపు(గురువారం) ఉదయం 11.30 గంటలకు విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నాలుగోసారి విచారణకు రావాలంటూ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. నెల రోజుల పాటు విదేశాల్లో ఉన్న అరవింద్ గత నెల 30వ తేదీన హైదరాబాద్‌కు వచ్చారు.
కాగా, తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అరవింద్ కుమార్‌ను మూడు సార్లు విచారించగా.. మళ్లీ నాలుగోసారి విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్-ఏ1, ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్‌ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది.