ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో కీలక పరిణామం.. | Centre Grants Permission To Prosecution Of IAS Officer Arvind Kumar In Formula E Car Race, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫార్ములా ఈ-కార్ రేస్‌ కేసులో కీలక పరిణామం..

Feb 14 2026 7:52 PM | Updated on Feb 14 2026 8:03 PM

Formula E Car Race: Permission Granted Prosecution Of Ias Arvind Kumar

సాక్షి, హైదరాబాద్‌: ఫార్ములా ఈ-కార్ రేస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి లభించింది. ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రాసిక్యూషన్‌ విషయంపై రాష్ట్రానికి కేంద్రం సమాచారం ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసుపై ఇప్పటికే విచారణ జరుపుతున్న ఏసీబీ.. మరో వైపు ఇప్పటికే కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్‌ అనుమతి ఇచ్చారు. ఈ కేసులో రాజకీయ, అధికారులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతి రావడంతో.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది.

ఫార్ములా ఈ-కారు రేసులో క్విడ్‌ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లింపుపై ఆరోపణలు చేసింది. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్‌ ఇప్పటికే పలుమార్లు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. రెండు సార్లు ఏసీబీ విచారణకు, ఒకసారి ఈడీ విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారు. ఇక, ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంపై 2024 డిసెంబరు 18న ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్‌, ఏ2గా ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, ఏ3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిపై కేసు నమోదు చేసంది.

Advertisement
 
Advertisement
Advertisement