తెలంగాణ: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు | Acb Searches At Rta Offices In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ: ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు

Jun 26 2025 4:04 PM | Updated on Jun 26 2025 4:27 PM

Acb Searches At Rta Offices In Telangana

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌తో పాటు పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు.. గేట్లు మూసివేసి అందరిని బయటకు పంపించివేశారు. ఆర్టీఏ బ్రోకర్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అవినీతికి పాల్పడుతున్న ఆర్టీఏ అధికారులపై ఏసీబీ రెండోసారి సోదాలు చేపట్టింది. ఉప్పల్, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఏజెంట్స్ ద్వారా జరుగుతున్న  పలు అక్రమాలపై ఏసీబీ నిఘా పెట్టింది. అక్రమాలకుపాల్పడుతున్న ఆర్టీఏ అధికారులపై డేగ కన్ను వేసిన ఏసీబీ.. ఆదాయానికి మించి ఆస్తుల సంపాదించిన ఆర్టీఏలపై దృష్టిసారించింది. ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్లను సైతం ఏసీబీ విచారిస్తోంది.

హైదరాబాద్‌ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌, రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్‌ ఆధ్వర్యంలో అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. తిరుమలగిరిలో ఇద్దరు క్లర్క్‌లతో పాటు 10 మంది ఏజెంట్లు, ఉప్పల్‌లో 10 మంది ఏజెంట్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement