తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం | Broker Moinuddin Arrested In Telangana Sheep Distribution Scam | Sakshi
Sakshi News home page

తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం

May 2 2025 9:37 AM | Updated on May 2 2025 10:33 AM

Broker Moinuddin Arrested In Telangana Sheep Distribution Scam

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణలో గొర్రెల స్కాంలో కీలకపరిణామం చోటుచేసుకుంది. గొర్రెల స్కాంలో దళారి మొయినుద్దీన్ అరెస్ట్ అయ్యాడు.

ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టరుగా వ్యవహరించిన మొయినుద్దీన్‌ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. అరెస్టు చేసేలోగానే అతడు దుబాయ్‌కి పారిపోయాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వచ్చిన   మొయినుద్దీన్‌ను ఇమ్మిగ్రేషన్ సహకారంతో శుక్రవారం ఉదయం ఎయిర్ పోర్టులోనే ఏసీబీ అదుపులోకి తీసుకున్నారు.  

కాగా, ఇప్పటివరకు గొర్రెల స్కాములో 17మంది అరెస్టయ్యారు. వారిలో మాజీమంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్, గొర్రెల మేకల పెంపకం సమైక్య మాజీ ఎండి రామచందర్ నాయక్, పలువురు వెటర్నరీ అధికారులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement