
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏసీబీ ఇప్పటికే సమగ్రంగా నివేదికను రెడీ చేసింది. ఇక, తాజాగా ఆ రిపోర్టు తాజాగా విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. దీంతో, ఈ కేసులో ఏం జరుగుతుందా? అనే సస్పెన్స్ నెలకొంది.
వివరాల ప్రకారం.. ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ నివేదిక విజిలెన్స్ కమిషన్ వద్దకు చేరింది. కాగా, మరో రెండు రోజుల్లో ఫైల్‌పై విజిలెన్స్ తుది నిర్ణయం తీసుకోనుంది. అనంతరం, ప్రభుత్వానికి ఫార్ములా ఈ-రేసు కేసు తుది నివేదికను అందజేయనుంది. ఒకవేళ, అక్కడ ఆమోదం వచ్చిన వెంటనే నిందితులపై చార్జిషీటు దాఖలు చేసేందుకు తిరిగి నివేదిక ఏసీబీకి చేరనుంది.
ఇక, ఫార్ములా ఈ-రేసు కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలతో పాటు మరో ఇద్దరు A4, A5 నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఫార్ములా ఈ-కారు రేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్‌ను మూడు సార్లు ఏసీబీ ప్రశ్నించింది.