విజయవాడ: ఏపీ ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం చోటు రేసుకుంది. చంద్రబాబుపై నమోదైన కేసును క్లోజ్ చేయొద్దంటూ వైఎస్సార్‌సీపీ గౌతమ్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. ఆ కేసును ఏసీబీ కోర్టు ఈనెల 8వ తేదీన విచారించనుంది.
ఫైబర్‌నెట్ కేసులో అక్రమాలపై చంద్రబాబుపై గతంలో సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఇటీవల తనపై ఉన్న కేసులను ఒక్కొక్కటిగా చంద్రబాబు క్లోజ్ చేయించుకుంటున్న తరుణంలో గౌతమ్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఫైబర్‌నెట్ కేసు కూడా క్లోజ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో గౌతమ్‌రెడ్డి రెడ్డి కోఓర్టులో పిటిషిన్ దాఖలు చేశారు. దాంతో ఆ కేసును ఏసీబీ కోర్టు 8వ తేదీన విచారణ చేపట్టనుంది.


