కర్నూలు: జిల్లాలోని గోనెగండ్లలో జాయింట్ కలెక్టర్‌ను రైతులు అడ్డుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఎనగండ్ల, ఐరన్‌బండ గ్రామాల పర్యటనకు వెళ్లారు జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్. అయితే జాయింట్ కలెక్టర్ కారుకు అడ్డుపడి తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్డుపైనే బైఠాయించాచు. గాజులదిన్నె ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ద్వారా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను రైతులు నిలదీశారు.
ప్రతీ సంవత్సరం బ్యాక్ వాటర్‌తో పంట పొలాలు మునిగి పోతున్నా తమను పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నష్టపోయిన రైతులకు సరిహారం అందించాలని అదే సమయంలో భూములు కోల్పోయిని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.


