ఢిల్లీ: ఏపీలో అరటి రైతులను తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.. కేంద్రాన్ని కోరారు. ఏపీలో అరటి రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, వారిని వెంటనే ఆదుకోవాలన్నారు. లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎంపీ మిథున్‌రెడ్డి.
‘టన్ను 25 వేల రూపాయల ఉండే అరటి...ఇప్పుడు కిలో 50 పైసలకు ధర పడిపోయింది. 50 పైసలకు ఒక బిస్కెట్ ఒక అగ్గిపెట్ట కూడా రాదు. అరటి కోత ధర కూడా కనీసం రైతుకు దక్కడం లేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఉచిత పంటల భీమా, ఇన్పుట్ సబ్సిడీ، ప్రత్యేక రైళ్లతో అరటి సరఫరా చేశాం.
తక్షణమే ప్రభుత్వం రైతులకు ఉచితంగా పంటల బీమా ఇవ్వాలి. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలి. అరటి పండ్ల సరఫరాకు ఎక్కువ రైళ్లను ఏర్పాటు చేయాలి. అరటి రైతులకు మద్దతు ధర ప్రకటించాలి. నా నియోజకవర్గంలోని కోడూరు అరటి పంటకు కేంద్రంగా ఉంది. కేంద్ర బృందాలు ఈ ప్రాంతాన్ని సందర్శించి రైతుల కష్టాలను స్వయంగా చూడాలి . భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.


