చంద్రబాబు.. ఇదేనా మీ బ్రాండ్‌..? | KSR CoMment On Chandrababu Ruling | Sakshi
Sakshi News home page

చంద్రబాబు.. ఇదేనా మీ బ్రాండ్‌..?

Dec 4 2025 3:37 PM | Updated on Dec 4 2025 4:08 PM

KSR CoMment On Chandrababu Ruling

పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి,ప్రభుత్వం నుంచి భూములు పొందుతుంటారు. వాటిని తక్కువ దరకు పొందుతారు.లేదా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకుంటారు.కాని తర్వాత రోజులలో ఎక్కువ సందర్భాలలో ఆ భూములు వారికి  ఏదో రూపంలో సొంతం అయిపోతుంటాయి. పారిశ్రామిక వాడలలో, లేదా ఇతరత్రా  వచ్చే  పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వాల తొలి లక్ష్యంగా చెబుతారు.

కాని ఆచరణలో  కాలం గడిచే కొద్ది ఆ  పరిశ్రమలు  మూతపడడం, లేదా వేరే  ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అందుకు ప్రభుత్వాలు అనుమతించడం, ఆ సందర్భంలో స్కామ్ ల ఆరోపణలు రావడం  వింటూనే ఉంటాం. ఏపీలో ఏకంగా 99 పైసలకే కొన్ని  ప్రైవేటు సంస్థలకు,కారు చౌకగా మరికొన్నిటికి  భూములు  ధారాదత్తం చేస్తున్న వైనం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.ఏపీలో అది ఒక దుమారంగా మారి ప్రజలలో చర్చ జరుగుతోంది. 

ఈ తరుణంలో తెలంగాణలో పారిశ్రామిక వినియోగంగా ఉన్న భూములను ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది.దీనిపై బిఆర్ఎస్ ,బీజేపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి.  ఐదు లక్షల కోట్ల స్కామ్ అని బిఆర్ఎస్ ఆరోపిస్తే, ఈ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటే ఆరు లక్షల కోట్లు వస్తుందని బీజేపీ వ్యాఖ్యానించింది. 

అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని ప్రభుత్వం తోసిపుచ్చింది. వీటిలో ఎంత వాస్తవం ఉందీ, లేనిది వేరే సంగతి .కాని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో, పరిసరాలలో ఉన్న  పారిశ్రామిక భూముల విషయంలో జరుగుతున్న  గందరగోళం నుంచి ఏపీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. కాని చంద్రబాబు  ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇష్టారీతిన భూముల పందారం చేస్తుండడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. 

ఏపీలో ఐటి కంపెనీలను  స్థాపించే ముసుగులో వస్తున్న కొన్ని సంస్థలు పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పి,ప్రభుత్వం నుంచి భూములు పొందుతుంటారు. వాటిని తక్కువ దరకు పొందుతారు.లేదా తక్కువ మొత్తానికి లీజుకు తీసుకుంటారు.కాని తర్వాత రోజులలో ఎక్కువ సందర్భాలలో ఆ భూములు వారికి  ఏదో రూపంలో సొంతం అయిపోతుంటాయి.పారిశ్రామికవాడలలో, లేదా ఇతరత్రా  వచ్చే  పరిశ్రమలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది ప్రభుత్వాల తొలి లక్ష్యంగా చెబుతారు.కాని ఆచరణలో కాలం గడిచే కొద్ది ఆ  పరిశ్రమలు  మూతపడడం, లేదా వేరే  ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అందుకు ప్రభుత్వాలు అనుమతించడం, ఆ సందర్భంలో స్కామ్ ల ఆరోపణలు రావడం  వింటూనే ఉంటాం. ఏపీలో ఏకంగా 99 పైసలకే కొన్ని  ప్రైవేటు సంస్థలకు,కారు చౌకగా మరికొన్నిటికి  భూములు  ధారాదత్తం చేస్తున్న వైనం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.ఏపీలో అది ఒక దుమారంగా మారి ప్రజలలో చర్చ జరుగుతోంది. 

ఈ తరుణంలో తెలంగాణలో పారిశ్రామిక వినియోగంగా ఉన్న భూములను ఇతర అవసరాలకు వాడుకోవడానికి వీలుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయింది. దీనిపై బిఆర్ఎస్ , బీజేపీలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నాయి.  ఐదు లక్షల కోట్ల స్కామ్ అని బిఆర్ఎస్ ఆరోపిస్తే, ఈ భూమిని ప్రభుత్వం అమ్ముకుంటే ఆరు లక్షల కోట్లు వస్తుందని బీజేపీ వ్యాఖ్యానించింది. అయితే ఇవి తప్పుడు ఆరోపణలు అని ప్రభుత్వం తోసిపుచ్చింది. వీటిలో ఎంత వాస్తవం ఉందీ,లేనిది వేరే సంగతి .కాని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ,పరిసరాలలో ఉన్న  పారిశ్రామిక భూముల విషయంలో జరుగుతున్న  గందరగోళం నుంచి ఏపీ ప్రభుత్వం పాఠం నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవల్సి ఉంది. 

కాని చంద్రబాబు  ప్రభుత్వం ఆ పని చేయకుండా ఇష్టారీతిన భూముల పందారం చేస్తుండడం తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. ఏపీలో ఐటి కంపెనీలను  స్థాపించే ముసుగులో వస్తున్న కొన్ని సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వీలుగా ప్రభుత్వమే  అవకాశం కల్పిస్తున్నదన్న  వార్తలు ఆందోళన కలిగిస్తాయి.  కొన్ని రియల్ ఎస్టేట్  కంపెనీలకు ఇచ్చే  భూములలో నలభై నుంచి ఏభై శాతం స్థలంలో ఐటి కార్యకలాపాలకు కాకుండా ఇళ్ల నిర్మాణం,కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించుకోవచ్చట.వాటిని అమ్ముకుని రియల్ ఎస్టేట్  వ్యాపారం చేసుకోవచ్చట. ఇలాంటివి  ఐటి ఉద్యోగాలు ఇవ్వలేవు. ఎందుకంటే అవి ఐటి కంపెనీలు కావు కనుక.  కాకపోతే అవి నిర్మించే భవనాలను ఐటి కంపెనీలకు అద్దెకు ఇస్తాయి. 

ఆ ఐటి కంపెనీలలో ఉండే ఉద్యోగాలు తమ ఖాతాలో వేసుకుని ప్రభుత్వం ఇచ్చే భారీ ప్రోత్సహాకాలను ఇవి   పొందుతాయట.విశాఖలోని కోట్ల విలువ చేసే భూములను ఈ రకంగా పందారం చేస్తున్నారు.ఇప్పటికే ఉర్సా అనే పేరుతో వెలసిన  కొత్త సంస్థకు అరవై ఎకరాల భూమి కేటాయించి ప్రభుత్వం విమర్శలపాలైంది. అయినా అదేతరహాలో రహేజా, కపిల్ చిట్ ఫండ్స్ ,బివిఎమ్  ఎనర్జీ,ఎఎస్ఎస్ ఆర్  మొదలైన  రియల్  ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వం భూమిని ఇవ్వడమే కాకుండా వేల కోట్ల రాయితీ ప్రయోజనాలు కల్పిస్తుండడం శోచనీయమని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.రహదారులు,నీరు,విద్యుత్, వంటి మౌలిక వసతులకు ప్రభుత్వమే ఖర్చు చేస్తుందట. ఇవి కాకుండా పెట్టుబడిలో అరవై నుంచి డెబ్బై శాతం ప్రోత్సాహకాల  పేరుతో వారికి చెల్లింపులు జరుగుతాయట.ఇటీవల రహేజ గ్రూప్ కు విశాఖపట్నంలో  27 ఎకరాల భూమిని 99 పైసలకే ప్రభుత్వం ఇచ్చేసింది. 

ఈ భూమి విలువ సుమారు 1300 కోట్ల పై మాటే అని చెబుతున్నారు.ఈ కంపెనీ నిర్మించే ఐటి క్యాంపస్ ద్వారా 15వేలమందికి ఉపాధి లభిస్తుందని అంచనా.దీనిపై భిన్నాభిప్రాయాలు   ఉన్నాయి.  బెంగుళూరు కు చెందిన సత్వా అనే రియల్ ఎస్టేట్ సంస్థకు 1500 కోట్ల రూపాయల విలువైన  భూమిని 45 కోట్లకే ఇచ్చేశారు.విశేషం ఏమిటంటే సత్వా కంపెనీ హైదరాబాద్ లో కోకాపేటలో ఇటీవలే వేల కోట్లు వ్యయం చేసి 25 ఎకరాలు కొనుగోలు చేసింది.ఈ కంపెనీ హైదరాబాద్ లో  తన భవనాలను లక్షల రూపాయలకు  అద్దెకు  ఇస్తోంది. విశాఖలో సైతం అదే రీతిలో ఐటి కంపెనీల నుంచి అద్దెలు వసూలు చేసే  అవకాశం ఉంటుంది. 

అలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ప్రభుత్వం ఏ ఇతర రాష్ట్రంలోలేని విధంగా కారుచౌకగా భూములు ఇవ్వడం ఎంతవరకు ఏపీ కి లాభదాయకమన్న ప్రశ్న వస్తోంది.విశాఖ ఇమేజీని చివరికి పైసలలోకి తీసుకువచ్చి ఇక్కడి భూమిని  పప్పు బెల్లాలమాదిరి  పంచుతారా అన్న బాధను  పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంలో ఒక  సంగతి చెప్పాలి. గతంలో దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయా చోట్ల పరిశ్రమలవారికి నిర్దిష్ట మొత్తాలకు భూములను కేటాయించితే దానిని క్విడ్ ప్రోకో గా టిడిపి ప్రచారం చేసింది.  వైఎస్ ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే  పాట అందుకుని రాజశేఖరరెడ్డి కుమారుడిపై కేసులు పెట్టించింది. చివరికి ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి నీరు సరఫరా చేయడాన్ని ఇదే కోవలో వేసి జగన్ కు అంటకట్టారు.

ఇప్పుడు ఏకంగా 99 పైసలకే వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ఇచ్చేస్తున్న చంద్రబాబు అండ్ కో కు ఎలాంటి లావాదేవీలు ఉన్నట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో తెలంగాణ  ప్రభుత్వం వేలంపాటలు నిర్వహిస్తే ఎకరా 130 కోట్ల నుంచి 170 కోట్ల వరకు అమ్ముడుపోయింది.  హైదరాడబాద్ కు విశాఖ కూడా పోటీ ఇచ్చే  నగరమే.  కోట్లలో భూమి ధర పలుకుతోంది.  అలాంటి విశాఖలో ఇంత ఘోరంగా భూములు  కట్టబెట్టడం ప్రజల ఆస్తులను కొల్లగొట్టడం కిందకు రాదా?అన్న ప్రశ్నకు జవాబు దొరకదు.పైగా ఈ కంపెనీలు కొన్ని అసలు  తమకు తక్కువ ధరకు భూమి ఇవ్వాలని కోరకపోయినా ఎందుకు కేటాయిస్తున్నారో అర్ధ కాదు. పరిశ్రమలు రావల్సిందే.కాని ఆ పేరుతో ఇలా భూములు కాజేస్తున్నారన్న భావన రానివ్వరాదు. భవిష్యత్తులో ఎంతకాలం  ఇవి సంబంధిత పరిశ్రమలు కొనసాగిస్తాయో లేదో తెలియదు. లూలూ మాల్ వంటివాటికి ఎకరాలకు ఎకరాలు లీజు పేరిట తక్కువ ధరకు భూములు ఇచ్చారు. 

ఒక నిపుణుడు చెబుతున్నదాని ప్రకారం 33 ఏళ్లు లీజ్ అయినా, ఆ తర్వాత దానిని అరవైఆరు ఏళ్లు,తదుపరి తొంభైతొమ్మిది ఏళ్లు  పొడిగించుతారు. చివరికి ఆ భూమి  లీజుదారుడికే  సొంతం అవుతున్నట్లే భావించాలి. హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో  పారిశ్రామిక భూమిని అప్పట్లో ప్రభుత్వం లీజుకు ఇచ్చినా, తాజాగా ప్రభుత్వ ఆలోచనల ప్రకారం 9వేల ఎకరాలలో  పరిశ్రమల బదులు ఇతర నిర్మాణాలు చేపట్టడానికి వీలు కల్పించబోతున్నారు. ఒకప్పుడు అజామాబాద్ పారిశ్రామికవాడ ను లీజు పద్దతిన ప్రభుత్వం ఇచ్చింది.కాని ఆ చుట్టుపక్కల నివాసాలు ఏర్పడడంతో అక్కడనుంచి పరిశ్రమలను తరలించాలన్న  ప్రతిపాదన వచ్చింది.

కాని ఆ సమయంలో ఆ భూములు తమకే ఇవ్వాలని పరిశ్రమలవారు పట్టుబట్టారు. తాజాగా  హైదరాబాద్, పరిసరాలలో ఉన్న పారిశ్రామికవాడలలోని భూముల వినియయోగాన్ని మార్చుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తూ ,కొన్ని కండిషన్లు పెట్టి రిజిస్ట్రేషన్ ఫీజ్  లో 30 శాతం చెల్లిస్తే చాలని నిర్ణయించింది.  దీనిపైనే బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కె.తారక రామారావు,బీజేపీ శాసనసభ పక్షనేత మహేష్ రెడ్డిలు ఇది లక్షల కోట్ల కుంభకోణం అని విమర్శిస్తున్నారు.ప్రభుత్వం ఖండించి తమ స్కీమ్ వల్ల ప్రభుత్వానికి ఐదువేల కోట్ల ఆదాయం సమకూరుతుందని చెబుతోంది. 

దీనిని చెడగొట్టడానికి విపక్షం కుట్ర పన్నుతోందని మంత్రులు బదులు ఇచ్చారు.అయినప్పటికీ  రేవంత్ ఈ విషయంలో జాగ్రత్తపడకపోతే గురువుకు తగ్గ శిష్యుడు అన్న విమర్శకు గురి అయ్యే ప్రమాదం ఉందన్నది కొందరి వ్యాఖ్య.ఉమ్మడి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు  సుమారు  ఏభైప్రభుత్వరంగ సంస్థలను మూసివేసి ,వాటి ఆస్తులను  ప్రైవేటు  పారిశ్రామికవేత్తలకు  తక్కువ  ధరకే అప్పగించారు. వారు  కూడా అక్కడ పరిశ్రమలు నడపడం లేదని, రియల్ఎస్టేట్   వ్యాపారంగా మార్చారని చెబుతున్నారు.  

ఇది చంద్రబాబు మోడల్ ఆర్ధిక విధానంగా కొందరు చమత్కరిస్తుంటారు. తెలంగాణలో ఎప్పుడో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇప్పుడు ప్రైవేటు పరం అవుతుంటే,ఏపీలో కొత్తగా ఇస్తున్న భూములు    ప్రైవేటువారికి  మొదటే సంపద చేకూర్చి పెడుతున్నాయన్న అభిప్రాయం  కలుగుతుంది. విశాఖలో మాదిరి అమరావతిలో కూడా ఇలాగే అణా,బేడాకు  భూములు ఇవ్వడానికి  చంద్రబాబు సిద్దపడతారా?అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు.ఐటి కంపెనీల ముసుగులో ప్రభుత్వం ఇలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు దోచిపెట్టడం సరైనదేనా?అన్నది వారి ఆవేదన.  ప్రజలకు సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు హోరెత్తించిన చంద్రబాబు తనకు కావల్సిన సంపన్నులకు సంపద బాగానే సృష్టిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబు బ్రాండ్ అంటే ఇదేనా? 
 
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement