సాక్షి, తాడేపల్లి: స్టీల్‌ప్లాంట్‌పై చంద్రబాబు ఎన్నికల ముందు ఏమన్నారు?.. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటూ వైఎస్ జగన్ నిలదీశారు. విశాఖలో ఉక్కుకు గనులు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని.. మా హయాంలో స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపేశాం’’ అని వైఎస్ జగన్ వివరించారు. ఉక్కు కార్మికులపై పీడీ యాక్ట్ పెట్టి లోపల వేస్తాడట..!’’ అంటూ చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు.
‘‘ఎస్‌ఏఐఎల్‌కు సొంత గనులున్నాయి. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు లేవు. ఎస్‌ఏఐఎల్, ఆర్‌ఐఎన్‌ఎల్‌కు తేడా ఇదే. విశాఖ స్టీల్‌కు సొంత గనులు లేకే నష్టాలు. మిట్టల్‌కు సొంత గనులు ఇవ్వాలని బాబు అంటాడు. కానీ విశాఖ స్టీల్‌కు మాత్రం సొంత గనులు అడగరు. ప్రైవేట్‌కు గనులు అడుగుతారు కానీ.. ప్రభుత్వ ప్లాంట్‌ను పట్టించుకోరు’’ అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


