సాక్షి, తాడేపల్లి: మద్యం కేసు నుంచి బయటపడేందుకే లేని కుంభకోణం ఒకటి సృష్టించారని.. ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తున్నారని చంద్రబాబు సర్కార్‌పై వైఎస్ జగన్ మండిపడ్డారు. రెడ్ బుక్ వెర్రితలలు వేస్తోందన్నారు. ‘‘కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీపీ వాళ్లే. మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులే కల్తీ లిక్కర్ దందా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలో కల్తీ దందా బయటపడింది. జయచంద్రారెడ్డికి బాబు స్వయంగా బీఫామ్ ఇచ్చారు. అనకాపల్లి, పరవాడలో కూడా కల్తీ మద్యం కేంద్రాలు నడిపారు. ఏలూరు, రేపల్లె, నెల్లూరులోనూ కల్తీ మద్యం దందా చేస్తున్నారు. రాష్ట్రమంతా కల్తీ మద్యం దందా నడుపుతున్నారు. లిక్కర్, బెల్టు షాపులు, పర్మిట్ రూమ్‌లన్నీ టీడీపీ వారివే. మ్యానుఫాక్యరింగ్, డిస్ట్రిబ్యూషన్ అంతా టీడీపీ వాళ్లే. టీడీపీ నేతలకు పోలీసులు సహాయం చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
‘‘జోగి రమేష్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారు. తప్పుడు వాంగ్మూలాలు, సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. జోగి రమేష్‌పై తప్పుడు కేసు పెట్టారు. జోగి రమేష్ కుమారుడిపై కూడా అక్రమ కేసు పెట్టారు. పిన్నెల్లి సోదరులపై కూడా అక్రమ కేసులు పెట్టారు. టీడీపీ వాళ్లే హత్యలు చేసుకుంటే పిన్నెల్లిని ఇరికించారు. టీడీపీ గ్రూప్ తగాదాల వల్లే హత్యలని ఎస్పీ చెప్పారు. టీడీపీ గొడవల వల్లే హత్యలని ఎస్పీ ట్వీట్ చేశారు
‘‘మా పార్టీ విద్యార్థి నాయకుడు కొండారెడ్డిపై అక్రమ కేసు పెట్టారు. కొండారెడ్డిపై గంజాయి అక్రమ కేసు పెట్టారు. రైల్వే న్యూ కాలనీలో గంజాయి పట్టుకున్నామని ఎఫ్‌ఆర్‌ఐ రాశారు. నిజానికి కొండారెడ్డి టిఫిన్ చేస్తుండగా పట్టుకెళ్లారు. బైక్‌కు జీపీఎస్ ట్రాక్ ఉంది కాబట్టి.. పోలీసుల దౌర్జన్యం బయటపడింది. పోలీసులు ఇలా చేస్తే వ్యవస్థలు బతుకుతాయా? రెడ్ బుక్‌ను పోలీసులు ఫాలో అయితే ఎలా?’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.
లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డిని వేధించారు. మిథున్‌రెడ్డి బెయిల్ సమయంలో జడ్జి సైతం ఎందుకు అరెస్ట చేశారని ఆశ్చర్యపోయారు. మా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారు. కాకాణి, వంశీ పోసాని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టులను.. చివరకు ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులనూ వేధించారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై ఇప్పటివరకు కేసు లేదు. బాధిత మహిళ ఆధారాలు చూపించినా విచారణ లేదు. వాట్సాప్ మెసేజ్‌లు చూపించినా పోలీసుల్లో చలనం లేదు. వార్త రాసిన సాక్షి విలేకరిపై కేసు పెట్టారు’’ అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.


