
సాక్షి, విజయవాడ: సిట్ సీజ్ చేశామని చెబుతున్న రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన విజయవాడ ఏసీబీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. హైదరాబాద్ ఫామ్‌హౌజ్‌లో సీజ్ చేశామంటున్న డబ్బు తనది కాదన్న రాజ్ కేసిరెడ్డి.. ఆ ఫామ్ హౌజ్ తీగల విజయేందర్‌రెడ్డికి చెందిందని తెలిపారు.
‘‘తీగల విజయేందర్‌రెడ్డికి ఇంజనీరింగ్ కాలేజీతో పాటు హాస్పిటల్, డయాగ్నోస్టిక్ సెంటర్‌లు ఉన్నాయి. విజయేందర్‌రెడ్డి రూ.కోట్ల టర్నోవర్‌తో లావాదేవీలు చేస్తారు. విజయేందర్‌రెడ్డికి చెందిన ఆరెట్ ఆసుపత్రిలో నా భార్య మైనార్టీ షేర్ హోల్డర్ మాత్రమే.
..అంతకు మించి విజయేందర్‌రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు. సిట్.. కట్టు కథలు చెప్పి నాకు బెయిల్ రాకుండా కుట్రలు చేస్తోంది. కేవలం నా బెయిల్‌ను అడ్డుకునేందుకే డబ్బులు సీజ్ అంటూ అబద్ధాలు చెబుతోంది’’ అని రాజ్ కేసిరెడ్డి చెప్పారు.
