
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.
‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది’’ అంటూ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత అన్నారు.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు…— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2025
హరీష్‌రావు రియాక్షన్..
కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ.. ప్రతీకార రాజకీయాలు రేవంత్ రెడ్డి అభద్రతకు స్పష్టమైన సంకేతమన్నారు. ‘‘కల్పిత కేసులు కోర్టులో నిలబడవు. ప్రజల విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గెలుచుకోవు. కేటీఆర్‌కు అండగా నిలబడతాం. కేటీఆర్ ఏసీబీ కేసులో సత్యం గెలుస్తుంది’’ అని హరీష్‌రావు అన్నారు.