హనుమకొండ అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవోగా ఉన్న వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కారు. కొత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణకు అనుమతి ఇవ్వడానికి రూ. 60వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనతో పాటు జూనియర్ అసిస్టెంట్ మనోజ్‌ను కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు వీరిని హనుమకొండ కలెక్టరేట్‌లో.. డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.


