
మిథున్‌రెడ్డి(ఫైల్‌ఫోటో)
సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు మద్యం అక్రమ కేసులో మిథున్‌రెడ్డికి సోమవారం(సెప్టెంబర్ 29) బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు.
మద్యం అక్రమ కేసులో జులై 19వ తేదీన మిథున్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 71 రోజులుగా రాజమండ్రి జైల్లో ఉన్న మిథున్‌రెడ్డికి ఇవాళ ఏసీబీ కోర్టు రెండు ష్యూరిటీలు, రూ.2లక్షల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు బెయిల్ మంజూరుతో మంగళవారం జైలు నుంచి విడుదల కానున్నారు.
👉ఇదీ చదవండి: పరాకాష్టకు బాబు భేతాళ కుట్ర
జూలై 19వ తేదీ(శనివారం) ఎంపీ మిథున్‌రెడ్డి స్వచ్ఛందంగా సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ అక్రమ కేసులో గతంలో ఓసారి ఆయన సిట్ విచారణకు హాజరయ్యారు. ఆరోజు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు సిట్ అధికారులు ఆయనను విచారించారు. అనంతరం మిథున్‌ను అరెస్ట్ చేసి విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు.
