మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత | - | Sakshi
Sakshi News home page

మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

మహా శ

మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట భ

మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత పెనమలూరు: యనమలకుదురులో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అన్నారు. ఆయన శుక్రవారం యనమలకుదురు కొండపై పర్యటించి పార్కింగ్‌, ఇతర ఏర్పాట్లు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారన్నారు. పండుగ రోజు ప్రభోత్సవం బాగా జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు పెడతామన్నారు. ప్రభల ప్రదర్శన సమయంలో ప్రత్యేక నిఘా పెడతామని డ్రోన్లతో నిత్యం గమనిస్తామని వివరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భక్తులు, ప్రభల నిర్వాహకులు పోలీసులతో పూర్తిగా సహకరించాలని సూచించారు. సమావేశంలో ఆలయ నిర్మాణ దాత సంగా నరసింహారావు, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకరమణ, ట్రాఫిక్‌ సీఐ వెంకటనారాయణ, ఈవో ఎన్‌.భవాని సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు ఎపిక్‌ క్విజ్‌ పోటీలు బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు ప్రారంభం

విజేతలుగా మచిలీపట్నం

వైద్య కళాశాల విద్యార్థులు

మచిలీపట్నంఅర్బన్‌: పింగళి వెంకయ్య ప్రభుత్వ వైద్య కళాశాలలోని కమ్యూనిటీ వైద్య విభాగం ఆధ్వర్యాన ఎపిక్‌ క్విజ్‌–2026 పేరుతో అంతర వైద్య కళాశాలల (మూడవ సంవత్సరం) విద్యార్థులకు శుక్రవారం క్విజ్‌ పోటీలు నిర్వహించారు. కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.టి.కె.రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి శాసీ్త్రయ పోటీలు విద్యార్థుల్లో వైద్య విజ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేస్తాయని తెలిపారు. పోటీల్లో మొత్తం ఎనిమిది వైద్య కళాశాలలు పాల్గొన్నాయి. వాటిలో గుంటూరు మెడికల్‌ కాలేజీ, ఎన్‌ఆర్‌ఐ మెడికల్‌ కాలేజీ, సిద్ధార్థ మెడికల్‌ కాలేజీ, పీఈఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (గన్నవరం), ఎయిమ్స్‌ మంగళగిరి, ప్రభుత్వ వైద్య కళాశాల ఏలూరు తదితర కళాశాలలు ఉన్నాయి. పోటీల్లో మచిలీపట్నం వైద్య కళాశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. గన్నవరం పీఈఎస్‌ వైద్య విజ్ఞాన సంస్థ విద్యార్థులు ద్వితీయ స్థానం సాధించారు. విజేతలకు ట్రోఫీలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ వైద్య విభాగాధిపతి డాక్టర్‌ టి.శివయ్య, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆశాలత, డాక్టర్‌ రత్నమంజుల, డాక్టర్‌ దుర్గారాణి, డాక్టర్‌ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

గుడ్లవల్లేరు: మండలంలోని కౌతవరంలో జాతీయ స్థాయి ఆహ్వాన బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోటీల్లో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 17 జట్ల క్రీడాకారులు పాల్గొన్నారు. అతిథులుగా అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ బి.సత్యనారాయణ, చైన్నె ఐఐటీ విశ్రాంత ప్రొఫెసర్‌ వెంకట చలపతి, కృష్ణా జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వెలగపూడి వెంకటేశ్వరరావు విచ్చేశారు. ముఖ్య అతిథి అడిషనల్‌ ఎస్పీ సత్యనారాయణ పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుట్టి పెరిగిన పల్లెటూరు కారణంగా చిన్ననాటి నుంచి క్రీడలపై మక్కువతో ఆటల్లో పాల్గొంటూ జాతీయ స్థాయిలో అనేక బహుమతులు సాధించానన్నారు. లీగ్‌ కమ్‌ సూపర్‌ లీగ్‌ పద్ధతిలో నిర్వహించే పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మత్తి శివ శంకర్‌ తెలిపారు. కార్యక్రమంలో చీఫ్‌ అడ్వైజర్‌ వి.దేశపతి, చీఫ్‌ రిఫరీ సింగరాజు మురళి, సాగునీటి డీసీ చైర్మన్‌ మల్లిపెద్ది సుబ్రహ్మణ్యం, సమ్మెట నాగేశ్వరరావు, మత్తి మణికుమార్‌, తూము కృష్ణ ప్రసాద్‌, పింగళి వెంకట సుబ్బారావు, పింగళి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మహా శివరాత్రి                        ఉత్సవాలకు పటిష్ట భ1
1/2

మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట భ

మహా శివరాత్రి                        ఉత్సవాలకు పటిష్ట భ2
2/2

మహా శివరాత్రి ఉత్సవాలకు పటిష్ట భ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement