డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రమే లక్ష్యం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): డ్రగ్స్‌ రహిత ఏపీగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సుజనా ఫౌండేషన్‌, ఎన్టీఆర్‌ జిల్లా పోలీసు సంయుక్త ఆధ్వర్యంలో వన్‌టౌన్‌ గాంధీజీ హైస్కూల్‌ ప్రాంగణంలో డ్రగ్స్‌పై దండయాత్ర కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ యువత సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను పెంచుతారని, వారిని ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగంతో యువత పెడదోవ పడుతోందన్నారు. ఏపీలో డ్రగ్స్‌ నిర్మూలించడానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్‌పై దండయాత్ర పేరుతో 18 రోజులుగా సైకిళ్లపై గ్రామాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్న ఐదుగురు మహిళా పోలీసులను సత్కరించారు. డ్రగ్స్‌పై దండయాత్ర ఏవీని లాంచ్‌ చేశారు. డ్రగ్స్‌ గుర్తించడంలో పోలీస్‌ డాగ్స్‌ పనితీరును చూపించిన విధానం ఆకట్టుకుంది. కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఏపీ దూదేకుల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌మీరా, ఈగల్‌ ఐజీ రవికృష్ణ, సీపీ రాజశేఖర్‌బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement