breaking news
midhun reddy arrest
-
Kottu Satyanarayana: కేవలం జగన్ ను దెబ్బ కొట్టాలనే ఈ కేసులు
-
కథ, స్క్రీన్ ప్లే రెడ్ బుక్.. అంతా డొల్ల..
-
'ఎంపీ అరెస్ట్ అప్రజాస్వామికం'
శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అమానుషమని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఎయిర్పోర్ట్ అధికారిపై చేయి చేసుకున్నారంటూ ఎంపీ మిధున్‌రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరమణ ఆదివారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని ఆయన ఖండించారు.