'ఎంపీ అరెస్ట్ అప్రజాస్వామికం' | ysrcp mla kalamata fires on AP government | Sakshi
Sakshi News home page

'ఎంపీ అరెస్ట్ అప్రజాస్వామికం'

Jan 18 2016 1:48 AM | Updated on Aug 18 2018 8:05 PM

'ఎంపీ అరెస్ట్ అప్రజాస్వామికం' - Sakshi

'ఎంపీ అరెస్ట్ అప్రజాస్వామికం'

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అమానుషమని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు.

శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం అమానుషమని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అన్నారు. ఎయిర్‌పోర్ట్ అధికారిపై చేయి చేసుకున్నారంటూ ఎంపీ మిధున్‌రెడ్డిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
 

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెంకటరమణ ఆదివారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ సర్కారు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచడాన్ని ఆయన ఖండించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement