మళ్లీ కొత్త కన్వాయ్ వాహనాల కొనుగోలు | Chandrababu Govt Purchase of new convoy vehicles once again | Sakshi
Sakshi News home page

మళ్లీ కొత్త కన్వాయ్ వాహనాల కొనుగోలు

Nov 14 2026 3:23 PM | Updated on Nov 14 2026 3:27 PM

Chandrababu Govt Purchase of new convoy vehicles once again

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాధనం వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి పనులకు నిధుల సమీకరణ వంటి అంశాలు సవాళ్లుగా మారుతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతా కాన్వాయ్ కోసం ఏకంగా రూ.1.78 కోట్లతో కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం ఆరు కొత్త వాహనాల కొనుగోలుకు ఏపీ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం సెక్యూరిటీ కాన్వాయ్‌లో ప్రస్తుతం వినియోగిస్తున్న టయోటా వాహనాల స్థానంలో కొత్తగా ఫోర్స్ ఆర్బానియా 4400 WB మోడల్ వాహనాలను కొనుగోలు చేయనున్నారు. మొత్తం ఆరు వాహనాల కోసం రూ.1,78,05,000 ఖర్చు చేయనుండగా.. ఒక్కో వాహనం సగటు ధర రూ.29.67 లక్షలుగా ఉంది.

ఈ వాహనాలను ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (GeM) పోర్టల్ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం గతంలో వాహనాల కొనుగోలుపై విధించిన నిషేధ ఉత్తర్వులకు ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. అదనంగా రూ.1.78 కోట్ల నిధుల కేటాయింపునకు కూడా ఆమోదం తెలిపింది.

అయితే ప్రజాధనంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం భారీగా ఖర్చు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న వాహనాలను కొనసాగించే అవకాశం ఉందా? వాటి స్థానంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రజల పన్నుల రూపంలో సమకూరే నిధులను అత్యవసర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ ఖర్చు చేయాల్సిన ప్రభుత్వం.. కాన్వాయ్ వాహనాల కొనుగోలుకు కోట్లాది రూపాయలు వెచ్చించడంపై విమర్శకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పసికందు అపహరణ.. ట్విస్ట్‌.. తిరిగి తెచ్చిచ్చిన నిందితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement